కృష్ణా: మోపిదేవి మండలంలోని 11/1 బ్రాంచ్ కాలువలో రైతులు స్వచ్ఛందంగా కలుపు మొక్కలను తొలగించారు. మోపిదేవి నుంచి వెంకటాపురం వరకు 3.5 కిలోమీటర్ల మేర ఉన్న ఈ కాలువ కింద 500 ఎకరాలకు పైగా సాగవుతోంది. తూటికాడ తదితర కలుపు మొక్కలు నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారడంతో ఆయకట్టు రైతులు ముందుకొచ్చారు. కాలువలోని గడ్డి జాతి మొక్కలను తొలగించి సాగునీటి ప్రవాహాన్ని మెరుగుపరిచారు.
ఆంధ్రప్రదేశ్
రైతులే రంగంలోకి.. కాలువలో పూడిక తొలగింపు


