నిజామాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో పోస్ట్ ఆఫీస్ ఎదుట రహదారిపై గురువారం ఉదయం ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలక్ట్రిక్ బస్సు కింద వృద్ధుడు చిక్కుకున్నాడు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వృద్ధుడిని బయటకు తీసి ప్రథమ చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
యాక్సిడెంట్.. బస్సు కింద చిక్కుకున్న వృద్ధుడు


