హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఫ్లైఓవర్ పై ఆటో బోల్తా.. విద్యార్థినులకు తీవ్ర గాయాలు

విశాఖ RTC కాంప్లెక్స్ వద్ద ఉన్న తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీద ఆటో తిరగబడి పలువురు కాలేజీ విద్యార్థినులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. ఆటో సైడ్ డివైడర్‌ను ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న కాలేజీ విద్యార్థినులు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో విద్యార్థినుల తలలకు, కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు వారికి సహాయం చేశారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.