SDPT: కొండపోచమ్మసాగర్ నీటిమట్టం తగ్గిపోవడంతో మునిగిపోయిన గ్రామాల రహదారులు బహిర్గతమవుతున్నాయి. రాజీవ్ రహదారి గౌరారం నుంచి ములుగు మండలం మామిడ్యాల, తానేదార్పల్లి, బైలంపూర్, తండాలను కలిపే రహదారి బయటపడింది. 15 టీఎంసీల సామర్థ్యమున్న జలాశయంలో ప్రస్తుతం 4 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీరు తగ్గి రోడ్లు తేలడంతో సమీప గ్రామాల వారు నాటి గురుతులను తనివితీరా చూసుకుంటున్నారు.
తెలంగాణ
కొండపోచమ్మలో బయటపడ్డ రహదారులు


