హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిద్దలూరులో 5 ఇళ్లలో చోరీ

ప్రకాశం: గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లిలో 5 ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగలు హల్చల్ చేశారు. కుటుంబ సభ్యులు ఊళ్లకు వెళ్లిన ఇళ్లను టార్గెట్ చేసిన దుండగులు మూడు ఇళ్లలో బంగారం, వెండి, నగదును అపహరించారు. రైల్వే ఉద్యోగి రమేశ్ బాబు ఇంట్లో 32 గ్రాముల బంగారం, 28 తులాల వెండి,17 వేల నగదు చోరీ అయినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఊళ్లకు వెళ్లేవారు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.