హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాకు భారీ వర్ష సూచన

ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. తెలంగాణకు ఏడు రోజుల పాటు వర్ష సూచన జారీ చేసింది. ఈ నెల 19 నుంచి 23 వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.