హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు'

AKP: వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా జరుపుకోవాలని గొలుగొండ ఎస్సై పి. రామారావు ప్రజలకు సూచించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మండలంలో డీజేలు, అధిక శబ్ద సౌండ్‌ సిస్టమ్‌ల వినియోగాన్ని నిషేధించినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సౌండ్‌ పరికరాలు స్వాధీనం చేసుకుని, సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.