హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎన్పీడీసీఎల్ ఏఏఓగా మంజీ నాయక్

ములుగు జిల్లా ఎన్పీడీసీఎల్ ఏఏఓగా పోరిక మంజీ నాయక్ బాధ్యతలు చేపట్టారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట జేఏఓగా పనిచేస్తున్న ఆయనకు పదోన్నతిపై ములుగుకు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన మంజీ నాయక్‌ను ఎస్ఈ భిక్షపతితో పాటు ఉద్యోగులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలతో అభినందించారు. ఆయన స్వస్థలం ములుగు మండలం మదనపల్లి కావడం విశేషం.