హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 19న ఉచిత వైద్య శిబిరం

VKB: ఈనెల 19న కొండగల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ రవీంద్ర యాదవ్ తెలిపారు. ఈ శిబిరంలో చర్మ వ్యాధికి సంబంధించిన నిపుణులు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. సమస్యలు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.