హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆక్రమణ నిర్మాణాలపై అధికారుల చర్యలు

BDK: భద్రాచలం మండలం, పురుషోత్తపట్నం దేవస్థాన భూముల్లో నిర్మించిన ఇళ్లపై అధికారులు చర్యలు చేపట్టారు. పోలీసు, రెవెన్యూ, దేవస్థాన సిబ్బంది కలిసి ఖాళీగా ఉన్న కొన్ని నిర్మాణాలను తొలగించారు. మరికొందరు ఆక్రమణదారులు తమ ఇళ్లను స్వచ్ఛందంగా తొలగించుకున్నారు. మిగిలిన వారు ఈ నెల 25లోగా నిర్మాణాలను తొలగించుకోవాలని అధికారులు సూచించారు.