ప్రకాశం: బేస్తవారిపేట మండలం చెట్టిచెర్ల గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన దాయాదుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఘటనలో కర్రలతో పరస్పరం దాడులు చేసుకోగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాత గొడవల నేపథ్యంలో ఈ గొడవ జరిగినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
ఇరువర్గాల మధ్య ఘర్షణ.. 8 మందికి గాయాలు


