హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరోగ్య ఉప కేంద్రాల పరిశీలన

MLG: వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట, జవహర్‌నగర్, పెద్దాపూర్ ఆరోగ్య ఉప కేంద్రాలను జిల్లా మాతా సంరక్షణ ప్రోగ్రాం అధికారి శ్రీకాంత్ సందర్శించి సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ఆశ కార్యకర్తలు ఇంటింటా సర్వే చేపట్టాలని, పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బాలికలందరూ హెచ్‌పీవీ టీకాలు వేయించుకోవాలన్నారు