హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విషాదం.. ట్రాక్టర్ నుంచి పడి వ్యక్తి మృతి

ATP: పెనుకొండలో వినాయక నిమజ్జన వేడుకల్లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. నిమజ్జనం పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ట్రాక్టర్ ట్రాలీపై నిలబడి ప్రయాణిస్తున్న ఆంజనేయులు (50) అదుపుతప్పి కిందపడిపోయారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు నారాయణమ్మ కాలనీకి చెందిన కార్పెంటర్‌గా గుర్తించారు.