హైదరాబాద్: 28°C
తెలంగాణ

'షరతులు లేకుండా పింఛను మంజూరు చేయాలి'

MLG: ఎలాంటి షరతులు లేకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతి కల్లుగీత కార్మికుడికి వృత్తి పింఛను మంజూరు చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు గుండెబోయిన రవిగౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం ములుగులో జరిగిన సమావేశంలో మాట్లాడారు. చిన్న కారణాలతో పింఛన్లు రద్దు చేయడం సరికాదని, దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని కోరారు. సమావేశంలో నర్సయ్య, శ్రీనివాస్, రమేష్ తదితరులున్నారు.