హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నకిలీ ఫొటోల పోస్టింగ్.. ఇద్దరి అరెస్ట్!

విశాఖపట్నంలో మహిళా డాన్సర్ల మార్ఫింగ్ ఫోటోలతో వేధింపులకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టైంది. ఫేక్ ఇన్‌స్టాగ్రామ్‌తో వారి ఫోటోలు పోస్ట్ చేస్తూ టార్చర్ పెడుతుండటంతో డాన్స్ బృందం నిర్వాహకుడు పోలీసులను ఆశ్రయించారు. విచారణ జరిపిన పోలీసులు  నిందితులు సాయిశ్రీకాంత్, జ్యోతిప్రసాద్ రావులను అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.