హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణిలో 17 ఫిర్యాదులు

BDK: కొత్తగూడెం నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజావాణిలో 17 ఫిర్యాదులు అందినట్లు కమిషనర్ సుజాత తెలిపారు. డివిజన్లలో నెలకొన్న సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని మేయర్ మూడ్ గణేశ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.