హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచి ఉచిత శిక్షణ

VKB: కుల్కచర్లలో నిరుద్యోగ యువతీ యువకులకు పుట్ట గొడుగుల పెంపకం, జూట్ బస్తాల తయారీలో నేటి నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. SBI, RSETI సంయుక్త ఆధ్వర్యంలో చిల్కూరులోని ప్రాంగణంలో శిక్షణ ఇవ్వనున్నారు. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు ఉన్నవారు అర్హులు. శిక్షణకు ఆధార్‌, 4 పాస్ ఫొటోలు, పదో తరగతి మెమో, కులం, ఆహార భద్రత కార్డు వెంట తీసుకుని హాజరు కావాలని నిర్వాహకులు తెలిపారు.