హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాయుధ రైతాంగ పోరాటంలో పర్సా కీలక పాత్ర..!

BDK: సాయుధ రైతాంగ పోరాటంలో కొత్తగూడెం, పాల్వంచ దళాలకు తొలితరం కమ్యూనిస్టు యోధుడు, సీపీఎం సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే పర్సా సత్యనారాయణ నాయకత్వం వహించారు. నిజాం ప్రభుత్వం ఆయనను నెలల తరబడి జైలులో నిర్బంధించింది. ఒక పోలీసు అధికారి సహాయంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు.