హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 20 వాహనాలకు జరిమానాలు.. రెండు బైక్‌లు సీజ్

BHPL: మహాదేవపూర్ మండలం ఏలికేశ్వరంలో బుధవారం రాత్రి పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీలు చేపట్టి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 20 వాహనాలకు జరిమానాలు విధించారు. నంబర్ ప్లేట్లు లేకుండా నడుపుతున్న రెండు బైకులు సీజ్ చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతరం మత్తు పదార్థాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.