హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ చీరల గదిలో అగ్నిప్రమాదం

HNK: ఎల్కతుర్తి మండల సమాఖ్య భవనంలోని స్టోర్‌రూమ్‌లో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో 829 ఇందిరమ్మ చీరలు, 25 టార్పాలిన్ పట్టాలు దగ్ధమయ్యాయి. వీటి విలువ సుమారు రూ.4.40 లక్షలు ఉంటుందని మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రోడ్డబోయిన స్వర్ణలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరసింహరావు తెలిపారు.