హైదరాబాద్: 28°C
తెలంగాణ

అదనపు తరగతి గదుల పనులు అసంపూర్తి

MBNR: బాలానగర్‌లోని 22 పాఠశాలలకు గత ప్రభుత్వం అదనపు తరగతి గదులను మంజూరు చేసింది. ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి. బాలానగర్ ZP బాలుర ఉన్నత పాఠశాలతో పాటు గంగాధర్‌పల్లి, హేమాజీపూర్ ప్రాథమిక పాఠశాలల్లో పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఉడిత్యాల ZP ఉన్నత పాఠశాలలోనూ పనులు ముందుకు సాగడం లేదు. ఇన్‌‌ఛార్జి ఎంఈవో శంకర్ నాయక్‌ను వివరణ కోరగా త్వరలో అందుబాటులోకి తీసుకోస్తామని తెలిపారు.