హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజాం పాలనకు వ్యతిరేకంగా బద్దం ఎల్లారెడ్డి పోరాటం

KNR: ఇల్లంతకుంట మండలం గాలిపెల్లిలో జన్మించిన బద్దం ఎల్లారెడ్డి ఉప్పు సత్యాగ్రహంతో ఉద్యమ ప్రస్థానం ప్రారంభించారు. ఆంధ్ర మహాసభ ద్వారా వెట్టిచాకిరీ, జమీందారీ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో గెరిల్లా దళాలకు దిశానిర్దేశం చేశారు. పేదలకు తన భూమిని పంచి ఆదర్శంగా నిలిచారు. 1952 తొలి సాధారణ ఎన్నికల్లో పీవీ నరసింహారావుపై ఎంపీగా గెలిచారు.