హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతాంగ పోరాట యోధుడు కర్రోళ్ల నర్సయ్య

SRCL: కోనరావుపేట మండలం మల్కపేటకు చెందిన కర్రోళ్ల నర్సయ్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలకంగా పాల్గొన్నారు. నిజాం నిరంకుశ పాలన, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పోరాడి జైలు జీవితం అనుభవించారు. 1957లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రైతులు, శ్రామికుల హక్కుల కోసం అసెంబ్లీలో గళమెత్తారు. అధికారం ఉన్నా ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.