హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

24 నుంచి యువతకు ఉచిత టాలీ శిక్షణ

కృష్ణా: అత్కూరు స్వర్ణభారత్‌ ట్రస్టులో ఈనెల 24 నుంచి నిరుద్యోగ యువతకు ఉచిత టాలీ శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. డిగ్రీ, పీజీ పూర్తి చేసిన యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 60 రోజుల శిక్షణలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. వివరాలకు 91000 33552, 93466 07845 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.