హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండు ద్విచక్ర వాహనాల ఢీ..!

NTR: తిరువూరులోని బోసుబొమ్మ సెంటర్‌లో ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మల్లెల గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ జమలయ్య బైకును మరో బుల్లెట్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో జమలయ్యతో పాటు బుల్లెట్ వాహనంపై ఉన్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.