హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నార్కోటిక్ డాగ్ సహాయంతో గంజాయి పట్టివేత

విశాఖ సిపి ఆదేశాల మేరకు, ఆస్ఐ (సెక్యూరిటీ వింగ్) ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ బృందాలు వివిధ ప్రాంతాల్లో నిత్య తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా బుధవారం మర్రిపాలెం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో నార్కోటిక్ డాగ్ సహాయంతో 10 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను  అదుపులోకి తీసుకున్నారు.