హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వనదుర్గాదేవి క్షేత్రంలో భక్తుల సందడి

MDK: నేడు శుభప్రదమైన గురువారం సందర్భంగా ఏడుపాయల ఆలయం వద్ద భక్తుల తిరునాళ్ళు ప్రతిబింబిస్తోంది. ప్రకృతి ఒడిలో వెలసిన శ్రీ వనదుర్గా భవాని అమ్మవారు ప్రత్యేక రూపంలో దర్శనమిస్తూ భక్తావళిని అనుగ్రహిస్తున్నారు. వేకువజాము నుంచే పాపనాశనంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. ఆలయంలో నిత్యపూజలు, అర్చనలు వైభవంగా కొనసాగుతున్నాయి.