GNTR: తుళ్లూరు మండలం పెదపరిమికి చెందిన కావూరి ఉషారాణి మృతికి కారణమైన టిప్పర్ డ్రైవర్ కొండమూది మస్తాన్‌కు తెనాలి కోర్టు ఆరు నెలల జైలు, రూ.1,000 జరిమానా విధించింది. 2021 మార్చి 14న కొల్లూరు కరకట్ట వద్ద స్కూటీని టిప్పర్ ఢీకొనడంతో ఉషారాణికి తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ మృతి చెందారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పవన్ కుమార్ తీర్పు వెలువరించారు.
ఆంధ్రప్రదేశ్
మహిళ మృతి కేసులో టిప్పర్ డ్రైవర్‌కు జైలు


