హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేయూత పింఛన్లకు 1,158 దరఖాస్తులు

VKB: తాండూరు మండలం 33 గ్రామ పంచాయతీల నుంచి చేయూత పింఛన్లకు 1,158 దరఖాస్తులు వచ్చినట్లు జూనియర్ సహాయకుడు ప్రమోద్ కుమార్ తెలిపారు. దివ్యాంగులు 198, వితంతు పింఛన్లకు 782, ఒంటరి మహిళలు 127, గీత కార్మికులు 51 మంది దరఖాస్తు చేసినట్లు తెలిపారు. ఈ దరఖాస్తుల్ని క్షేత్రస్థాయిలో MPDO విశ్వప్రసాద్, AEలు నందని, వెంకటేష్ బృందాలు విచారణ చేసి అర్హులను పింఛన్ మంజూరుకు ఎంపిక చేస్తారన్నారు.