హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 21న NCC క్యాడెట్ల ఎంపిక

PPM: జిల్లాలోని ఎస్వీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 21న NCC క్యాడెట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ సీహెచ్ చలపతి రావు తెలిపారు. డిగ్రీ ప్రథమ సంవత్సరం (బీఏ, బీకాం, BSC) చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మొత్తం 18 సీట్లకు ఈ ఎంపికలు జరుగుతాయి. మరిన్ని వివరాల కోసం NCC ప్రోగ్రాం అధికారి DVVS గుప్తాని సంప్రదించాలని సూచించారు.