హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.3 వేలకే మొబైల్ అంటూ మోసం

MHBD: రూ.3 వేలు చెల్లిస్తే రూ.21 వేల విలువైన మొబైల్ ఫోన్ ఇస్తామని నమ్మించి ఆటో డ్రైవర్‌ను మోసం చేసిన ఘటన బుధవారం డోర్నకల్ మండలం బొడ్రాయితండాలో వెలుగుచూసింది. గుర్తుతెలియని మహిళ ఫోన్‌లో చెప్పిన మాటలు నమ్మిన నాగేశ్వరరావు రూ.3వేలు చెల్లించి పార్సిల్ తీసుకోగా అందులో మొబైల్‌కు బదులు బ్లూటూత్ పరికరం ఉంది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.