హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరి సన్న రకాల నమోదుకు నేడే చివరి తేదీ..

KMM: వరి 7 సన్న రకాల కొనుగోలు వివరాల నమోదు చేసుకున్న రైతులకే బోనస్ వస్తుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య తెలిపారు. వరి సన్న రకాల నమోదుకు ఈనెల 17 చివరి తేదీ అని చెప్పారు. రైతులు తాము కొనుగోలు చేసిన వరి విత్తనాలకు సంబంధించిన కొనుగోలు బిల్లులను తీసుకొని, విత్తనాలు కొనుగోలు చేసిన డీలర్‌ను సంప్రదించి ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.