హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి పర్యటన రద్దు.. కారణం ఇదే.!

కృష్ణా: పెడనలో గురువారం జరగాల్సిన మంత్రి నారా లోకేశ్ పర్యటన రద్దయిందని MLA కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. పెడనలో నిర్వహించనున్న కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొనాల్సి ఉందన్నారు. ఏలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఆళ్ల నాని అంత్యక్రియలకు లోకేశ్ హాజరుకావాల్సి ఉన్నందున పెడన పర్యటన రద్దయిందన్నారు. తదుపరి పర్యటన తేదీని త్వరలో ప్రకటిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.