హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి సేవిస్తున్న ఇద్దరి అరెస్ట్..

BHPL: గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను కాటారం పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఓడిపిలవంచ చెరువు కట్ట వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులను చూసి పారిపోతున్న వావిళ్ల రంజిత్, దేవదాసులను పట్టుకున్నారు. భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఇద్దరికీ టీహెచ్‌సీ పాజిటివ్‌గా తేలడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.