హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడే మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం

అనకాపల్లి జిల్లా చీడికాడ మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం ఇవాళ ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఇన్‌‌ఛార్జ్ MPDO శ్రీనివాస్ తెలిపారు. మండల స్థాయి అధికారులందరూ ఈ సమావేశానికి తప్పక హాజరుకావాలని సూచించారు. ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం ఈ నెల 23వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో, ఈ సమావేశంలో సభ్యులకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.