హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పారిశుద్ధ్య నిర్వహణకు ప్రజల భాగస్వామ్యం అవసరం'

W.G: గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. భీమవరం మండలం రాయలంలో నిర్వహించిన 'స్వచ్ఛపదం' కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రతి కుటుంబం తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని పిలుపునిచ్చారు. చెత్తను రోడ్లు, కాలువల్లో వేయకుండా పరిశుభ్రతకు సహకరించాలని కోరారు.