HNK: నిరంతర అప్రమత్తతతోనే నేరాలను అరికట్టవచ్చని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత అన్నారు. బుధవారం కాజీపేట పోలీస్‌స్టేషన్, రైల్వేస్టేషన్‌ను ఆమె తనిఖీ చేశారు. రైల్వేస్టేషన్‌లో అనుమానితుల వేలిముద్రలను బయోమెట్రిక్ ద్వారా పరిశీలించి పాత నేరగాళ్లను గుర్తించే విధానాన్ని పరిశీలించారు. పోలీస్‌స్టేషన్‌లో రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తుపై సిబ్బందికి సూచనలు చేశారు.
తెలంగాణ
నిరంతర అప్రమత్తతతోనే నేరాలకు అడ్డుకట్ట: సీపీ


