హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామీణ రహదారులపై అధికారుల నిర్లక్ష్యం!

SRPT: మోతె మండలంలోని గ్రామీణ లింకు రోడ్లు అధ్వానంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలోని రహదారుల ఇరువైపులా కంపచెట్లు పెరిగి, రోడ్లు గుంతలమయమయ్యాయి. భారీ వాహనం ఎదురొస్తే చిన్న వాహనాలు రోడ్డు కిందకు దిగాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.