హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజాం సైనికుల కాల్పుల్లో 15 మంది బలి

WGL: నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పర్వతగిరి మండలం కొంకపాక గ్రామం విషాద ఘటనకు సాక్ష్యంగా నిలిచింది. 1948 మార్చి 15న నిజాం సైనికులు జరిపిన కాల్పుల్లో 15 మంది గ్రామస్థులు మృతిచెందినట్లు గ్రామ చరిత్రలో నమోదైంది. అమరవీరుల జ్ఞాపకార్థం 1994 జనవరి 27న గ్రామంలో శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. నేడు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా స్మరించుకుంటారు.