హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పింఛన్ ప్రక్రియను ప్రారంభించిన కలెక్టర్

WG: అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక పింఛన్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త దరఖాస్తులకు అవకాశం కల్పించిందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం భీమవరం మండలం రాయలం సచివాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆమె పరిశీలించారు. అర్హులు సమీప గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.