హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్త పింఛన్లకు దరఖాస్తుల గడువు పెంపు

KKD: కొత్త పింఛన్ల దరఖాస్తుకు ఈనెల 18 వరకు గడువు పెంచడంతో పలువురికి ఊరట లభించింది. వివిధ సాంకేతిక కారణాలు, ధ్రువపత్రాల జారీలో జాప్యంతో దరఖాస్తు చేయని పేదలకు వెసులుబాటు కలిగింది. జిల్లాలోని 620 స్వర్ణగ్రామ, వార్డు కార్యాలయాల్లో బుధవారం వరకు 50,260 మంది కొత్తగా పింఛనుకు దరఖాస్తు చేశారు.