హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

20న కడపలో చెస్ టోర్నమెంట్

కడప నగరంలో ఈ నెల 20న ఆదివారం ఆలిండియా ఓపెన్ చెస్ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి అనీస్ దర్భారీ తెలిపారు. అన్నమయ్య కూడలి సమీపంలోని నూర్‌-ఎ-జహాన్ ఫంక్షన్‌ హాల్లో ఈ పోటీలు జరగనున్నట్లు పేర్కొన్నారు.ఆసక్తి ఉన్న క్రీడాకారులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని ఆయన కోరారు.