హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాలో జాబ్ మేళా

SRD: సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాల కామర్స్ నూతన భవనంలో ఈ రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఐసీఐసీఐ, ఎన్ఐఐటీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రవీణ తెలిపారు. రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టుకు 20-25 ఏళ్లలోపు, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. బీఈ, బీటెక్ అభ్యర్థులు అనర్హులు. వివరాలకు ఈ నంబర్‌ 9491884475ను సంప్రదించవచ్చని తెలిపారు.