KDP: పులివెందుల శివారులోని అంతర్జాతీయ పశు పరిశోధన కేంద్రం పరిసరాల్లో బుధవారం కుక్కల దాడిలో రెండు జింకలు మృతి చెందాయి. కేంద్రం పరిసరాల్లో సంచరిస్తున్న జింకలపై కుక్కలు దాడి చేయడంతో తొలుత ఒకటి, అరగంట తర్వాత మరో జింక మృతి చెందింది. సిబ్బంది సమాచారంతో అటవీశాఖ అధికారి గోపాలకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
కుక్కల దాడిలో జింకలు మృతి


