ASF: వినాయక విగ్రహాల నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ హరిత అధికారులకు సూచించారు. కాగజ్ నగర్ మండలంలోని పెద్దవాగు పంపుహౌజ్ వద్ద నిమజ్జన ప్రదేశాన్ని సబ్ కలెక్టర్, DSPతో కలిసి సందర్శించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడంతోపాటు రహదారి మరమ్మతులు చేపట్టాలన్నారు. గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు.
తెలంగాణ
విగ్రహాల నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాలి: కలెక్టర్


