ATP: పింఛన్ల దరఖాస్తు గడువును ఈ నెల 18 వరకు పొడిగించినట్లు డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శైలజ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సచివాలయాల ద్వారా దరఖాస్తు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆసక్తి గలవారు గడువులోగా వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు


