హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చివరి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలి'

WNP: భూత్‌పూర్ కెనాల్ నుంచి అమరచింత పెద్దచెరువు, పిన్నంచర్ల, బాలకృష్ణపూర్ చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇవ్వాలని రైతులు అధికారులను డిమాండ్ చేశారు. రైతుల విజ్ఞప్తి మేరకు డీఈ మహేశ్, ఏఈ బాలకృష్ణ డీ-24 కెనాల్ ను పరిశీలించారు. నీరు లేక బోర్లు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని కౌన్సిలర్ తిరుమలేష్ తెలిపారు. వెంటనే సాగునీరు అందించాలని కోరారు.