హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KDP: ప్రొద్దుటూరు పట్టణంలోని మైదుకూరు రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో గురువారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేయనున్నట్లు SPDCL DE ఎంఆర్‌ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. రోడ్డు విస్తరణ పనులకు సంబంధించిన విద్యుత్‌ సౌకర్యాల మార్పులు, ఇతర పనుల కారణంగా ఈ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.