హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోడల్ సోలార్ గ్రామంగా నంది మేడారం

PDPL: పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన కింద జిల్లాలో ధర్మారం మండలం నంది మేడారంను మోడల్ సోలార్ గ్రామంగా ఎంపిక చేసినట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. బుధవారం ఆయన ఐడిఓసిలో ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. గ్రామంలో 2,310 ఇళ్లకు సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.