KKD: ఆటోల్లో ప్రయాణికులు, విద్యార్థులను పరిమితికి మించి ఎక్కించుకుంటే వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని కాకినాడ ట్రాఫిక్ వన్ సీఐ నూని రమేశ్ హెచ్చరించారు. బుధవారం కాకినాడలో ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ఫ్రెండ్లీ పోలీస్‌గా ఉంటామని తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
పరిమితికి మించి ఎక్కిస్తే సీజ్: సీఐ


